గుండెలోతు by S Sridevi

( విపుల - సెప్టెంబర్ 2000, గుండెలోతు స్వీయసంపుటి, వాసిరెడ్డి నవీన్ గారి "కథ" , పి. సత్యవతిగారి నేతృత్వంలో ఇంగ్లీషులోకి అనువదించబడి, సాహిత్య అకాడమీ women writers compilationలో వచ్చింది ) ప్రేమంటే ఏమిటో తెలియకుండానే జీవితపు చరమాంకంలోకి చేరుకునేవారు ఎందరో. ఆపైన సంధ్య వాలుతుంది. మృత్యువు కబళిస్తుంది. మనసు వికసించని మొగ్గగానే రాలిపోతుంది. ఈ వాస్తవం తెలియక ఎందరో ఆడామగా కలిసి మాట్లాడుకోగానే అదే ప్రేమనేసుకుని ఎంతో దూరం ఊహించుకుంటారు.దీనికి నేను మినహాయింపు కాదు … Continue reading గుండెలోతు by S Sridevi

మళ్ళీ అదే తీరానికి by S Sridevi

లాబ్‍లో ఇచ్చిన రిపోర్టులు తీసుకుని డాక్టరుకి చూపించి ఆయన చెప్పింది విని మౌనంగా ఇవతలికి వచ్చాడు మధు."మీరు కాఫీ టీలు, సిగరెట్లు మానెయ్యాలి. అల్సర్స్ బాగా పెద్దవయ్యాయి. వీలైనంత తొందరగా సర్జరీ చేయించుకోండి" డాక్టరు మాటలు చెవుల్లో మార్మోగాయి. ఆరోగ్యం కన్నా విలువైనదీ, మనిషికి జీవనపోరాటంలో నైతికబలాన్నిచ్చేదీ మరేదీ వుండదు. ఇంకేం మిగిలింది తనకి? మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు. ఎలా వున్నా ఏం తిన్నా పట్టించుకుని మందలించేవాళ్ళు లేరు. మనసు చాలా అలజడిగా మారింది. క్రమంగా … Continue reading మళ్ళీ అదే తీరానికి by S Sridevi

బేబీ ఆఫ్ అర్చన by S Sridevi

( విపుల - మే 1999, గుండెలోతు కథలసంపుటి)బేబీ ఆఫ్ అర్చన…ఐదునెలల మృతశిశువు…ఆపరేషను బల్లమీద నిర్జీవంగా పడి ఉంది.ఐదు నిమిషాలక్రితందాకా కదులుతూనే ఉన్న ముద్దొచ్చే చిన్ని ప్రాణి.బేబీ ఆఫ్ అర్చన గుండెకి చిల్లుంది. మెటర్నిటీ వార్డునుంచి కార్డియాలజీ వార్డుకి పంపించారు. శిశువుకి ఆపరేషన్స్ చెయ్యాలి. డాక్టర్ రావు చేశాడు. కానీ మొదటి ఆపరేషనే విజయవంతం కాలేదు.అర్చన!  ఈ శిశువు కోసం ఏడ్చేది.  తపన పడేది. నేనేం పాపం చేస్తే ఇలా జరిగిందని శోధించుకునేది. తనని కలవడానికి వచ్చినప్పుడు … Continue reading బేబీ ఆఫ్ అర్చన by S Sridevi

ఒలీవియా by S Sridevi

(ఆంధ్రభూమి 2017)"అమ్మా! మాకు ఇంగ్లీషుకి కొత్త టీచరు వచ్చింది. పేరు ఒలీవియా"స్కూలునించీ రాగానే వుత్సాహంగా చెప్పింది అమూల్య. ఆ చెప్పడంలోనే అర్ధమైంది, కొత్త టీచరు బాగా నచ్చిందని.ఆ పేరు కాలం పొరల వెనుక నిద్రాణంగా వున్న జ్ఞాపకాన్ని తట్టి లేపింది. సుదూర గతం. వర్తమానంతో లింకులు తెగిపోయినది. తెగిపోయాయనుకున్న లింకులు మళ్ళీ వర్తమానాన్ని అందుకుంటాయన్న వూహ ఆ క్షణాన్న కలగలేదు."అమ్మా! రాగానే ఒలీవియా టీచరు మాకో కథ చెప్పింది తెలుసా? చాలామంచిది కదమ్మా? " అంది అమూల్య."ఏం … Continue reading ఒలీవియా by S Sridevi

లే ఆఫ్ by S Sridevi

(ఆంధ్రభూమిలో 2003 లో ప్రచురించబడి, గుండెలోతు సంపుటంలో చేర్చిన నా కథ) నాకు సముద్రమంటే చాలా ఇష్టం. సముద్రాన్ని ప్రేమించేవాళ్ళు ప్రకృతినీ దాన్నిబట్టి మనుషుల్నీ, మానవ సంబంధాలనీ ప్రేమిస్తారని నాకో గట్టి నమ్మకం.నేను చీరాలలో ఒడ్డున ఉన్న పడవలో కూర్చుని చూసిన సముద్రాన్నే జ్వాల రామకృష్ణా బీచ్ లో చూసి మానవ సంబంధాలను మరోలా విశ్లేషిస్తుందని తెలీదు. ఆ తెలీక పోవడానికి కారణం అప్పటిదాకా తనతో నాకు పరిచయం లేకపోవటమే.విశాఖపట్నంలో తను, గుంటూరులో నేను ఎంసీఏ చేసి … Continue reading లే ఆఫ్ by S Sridevi

యుద్ధం ముగిసాక

రచన:యస్ శ్రీదేవి యుద్ధం ముగిశాక(విపుల మే 2002, సింధూరి కథల సంపుటి)హీరో హీరోయిన్లు పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాక సినిమాకథ ముగుస్తుంది. రాజులు యుద్ధంలో జయాపజయాలని పంచుకున్నాక చరిత్ర ముగుస్తుంది. కాని నిజజీవితంలో కథ మొదలయ్యేది పెళ్ళితోనే. సామాన్యుల జీవితకథలు మొదలయ్యేది యుద్ధం ముగిశాకే.నేను ప్రేమ యుద్ధం చేశాను. "నేనతన్ని ప్రేమించాను, ఇద్దరం పెళ్ళిచేసుకుందామనుకుంటున్నాం" అని మీరా వచ్చి చెప్తుందేమోనని చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను. ఆ ఆశ మనసులో పుట్టిన క్షణం తర్వాత కొన్ని లక్షల క్షణాలు … Continue reading యుద్ధం ముగిసాక

మలుపు

రచన:యస్. శ్రీదేవి "సార్! మిమ్మల్ని కలవాలట" విజిటింగ్ కార్డు తెచ్చి టేబుల్ మీద ఉంచాడు పిఏ.క్యాజువల్ గా దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు శ్రీపాద. కొంత కుతూహలం లేకపోలేదు. అతనికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లలో ఎక్కువ భాగం కాలేజ్ విద్యార్థులు. బయట ఎదురు చూసి చూసి తను కనిపించగానే ఎగబడి ఆటోగ్రాఫులు తీసుకుంటారు. ఎంతో దూరం నుంచి వచ్చి తనని దూరం నుంచేనా చూసి సంతృప్తితో వెళ్లిపోయేవారు ఇంకొందరు ఉంటారు. ఇలా విజిటింగ్ కార్డ్ పంపించి … Continue reading మలుపు

యంత్రసేవ

రచన:యస్. శ్రీదేవి మాస్టర్!మీరు మాకు సమగ్రమైన ఆకృతినిచ్చారు.సునిశితమైన సాంకేతికతనిచ్చారు. మా సంఖ్యని చెప్పుకోదగ్గంతగా పెంచారు. దేశవిదేశాల ప్రతినిధులముందు మేమే మిన్న అనిపించారు. విశ్వాన్ని శోధించి గ్రహాలని అన్వేషించి ఎక్కడెక్కడికో విస్తరించాం. కానీ ….ఇదంతా చేస్తూ వున్నప్పుడు నన్నొక ప్రశ్న వెంటాడేది… మేమిదంతా ఎందుకు చేస్తున్నాం అని.ప్రశ్న అనేదికూడా మీరిచ్చిన సాంకేతికతే. మాలో తలెత్తే ప్రశ్నలుకూడా మీరివ్వగలిగే జవాబులకి అనువుగానే వుంటాయి. అదే ఎందుకని మరో ప్రశ్న. బేసిక్ ప్రోగ్రాంలోకి వెళ్ళి చూసాక తెలిసింది, మేం కేవలం మీలాగ … Continue reading యంత్రసేవ

లాటరీ

రచన:యస్. శ్రీదేవి " ఔన్రా !   మనకి కంప్యూటర్ లంటే ఏంటో తెలీదు. పెద్దగా చదువుకోలేదు. మెట్రిక్కుగాళ్ళం. అయినంతమాత్రాన ఉద్యోగాల్లోంచీ తీసేస్తారా?"పాతతరానికి చెందిన రాజమౌళి ప్రశ్నే కొద్దిగా మారి తన కొడుకు నుంచి కూడా వస్తుందని వెంకట్రావుఅనుకోలేదు ఆ క్షణాన. రాజమౌళి అలా అడగటానికి కారణం వాళ్ల డిపార్ట్మెంట్ ని ఆధునీకరణ చేసి కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్లు వచ్చాయి కాబట్టి పని తగ్గి  సిబ్బంది ఎక్కువయ్యారని యాజమాన్యం నిర్ణయానికి వచ్చి వీఆర్ఎస్ ప్రకటించింది. ఎన్నో ఉద్యోగాల మీద … Continue reading లాటరీ

విముక్తి

రచన:యస్. శ్రీదేవి "అమ్మేంటి అలా అంది? నాన్న చాలా బాధపడుతున్నారు" అన్నాడు రాంబాబు భార్యతో. వసుధకీ అలాగే అనిపించింది. కానైతే ఆమె నాణానికి గల రెండోవైపుని గురించి కూడా ఆలోచించింది. అత్తగారు మాట తూలే మనిషి కాదు. అలాంటామె అంతమాటందంటే కారణం ఏమై ఉంటుంది?సంక్రాంతి పండుగకని వచ్చారు అందరూ. పండుగ సరదా, హడావిడీ ఆవిరైపోయాయి. ఇదే చర్చనీయాంశమైంది. రాజారావైతే అతలాకుతలమైపోతున్నాడు. అవమానంతో దహించుకుపోతున్నాడు.ఎంత మాటంది భార్య! తనని వదిలేసి వెళ్ళిపోతుందట. ఎంత అహంభావం ఆమెకి. ఇద్దరు కొడుకులు, … Continue reading విముక్తి