లివింగ్ టుగెదర్ by S Sridevi

టప్ మని వాన చినుకు మీద పడటంతో మెలకువ వచ్చింది మహతికి. నిద్రపోవటానికి ముందున్న వాతావరణం ఇప్పుడు లేదు. ఆకాశంనిండా దట్టంగా మబ్బులు కమ్మేసి వున్నాయి. ఈ క్షణాన్నో మరుక్షణాన్నో కురవనున్న కుంభవృష్టికి స్వాగతం పలుకుతూ ఎవరో విసుర్తున్న పూరెక్కల్లా రాలిపడుతున్నాయి ఒకటి రెండు చినుకులు. అలాంటి చినుకే ఒకటి మొహమ్మీద పడటంతో కొద్దిగా కదిలాడు నిశాంత్.“లేవండి, లోపలికి వెళ్దాం. వానొచ్చేలా వుంది” అనబోతున్న మహతి ఆగిపోయింది. అస్పష్టంగా కలవరిస్తున్నాడతను. వినాలని ప్రయత్నించింది.“ఐ…లవ్..యూ…”విస్మయం కలిగిందామెకి. పెళ్ళైన ఎనిమిదేళ్ళకి…

పగుళ్లు by S Sridevi

“శ్రీకళా!  వదిన పద్ధతేం నచ్చట్లేదు. ఎవరెవర్నో భోజనానికి పిలుస్తోంది. నేను లేని వేళ పరాయిమగవాడికి భోజనం పెట్టడమేమిటి చెప్పు?” పనిగట్టుకుని ఫోన్ చేసి చెల్లెలికి చెప్పాడు శ్రీధరమూర్తి.“భోజనాలవేళ నువ్వు లేకపోవటమేమిటి? ఎక్కడికి వెళ్తున్నావు?” అడిగింది శ్రీకళ. ఆమెకి విషయం అంతా తెలిసిందని అర్థమైంది.“నాకు సవాలక్షపనులుంటాయి. రోజంతా ఇల్లు కనిపెట్టుకునే వుండలేనుకదా? ఐనా నేను వద్దన్నా ఈ అల్లరేమిటి? అరవయ్యేళ్ళ మనిషి…” అన్నాడు కింద పడ్డా గెలుపు తనదేనన్నట్టు.“నీకు అరవయ్యైదు లేవూ? నాకన్నా నాలుగేళ్ళు పెద్దవాడివికదూ?” అంది. శ్లేష…

నువ్వెవరు? by S Sridevi

“ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజమేనట. ఇంకా ఏవో ఆధారాలు దొరికాయని శ్రీరామచంద్రమూర్తి పోస్టు పెట్టాడు” అంటూ వచ్చి కూర్చుంది పరిమళ.“శ్రీరామచంద్రమూర్తే పెట్టాడంటే వప్పుకుని తీరాల్సిన విషయమే” పరిహాసంగా అన్నాడు చంద్ర.చంద్ర ఇంకా అంటునే వున్నాడు, అతను రానే వచ్చాడు.వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. శ్రీరామచంద్రమూర్తితో కలిసి చదువుకున్నారు. ఎక్కడెక్కడో వుద్యోగాలు చేసి రిటైరయాక స్వంతయిళ్ళలో పక్కపక్కని స్థిరపడ్డారు. వాళ్ళకిద్దరూ, వీళ్ళకిద్దరూ పిల్లలు. దేశదేశాల్లో వుద్యోగాలు చేసుకుంటున్నారు. శ్రీరామచంద్రమూర్తి భార్య జానకి ఆర్నెల్లు అమెరికాలో, ఆర్నెల్లు ఇక్కడా వుంటుంది. ఇక్కడుండే ఆర్నెల్లలోకూడా…

వంటింటి కిటికీ by S Sridevi

వంటింటి కిటికీలోంచి చూస్తే పెరడంతా కనిపిస్తుంది. గుత్తులు గుత్తులుగా పూసిన గన్నేరుపూలు, నందివర్ధనాలు, నూరు వరహాలు, విరగబూసిన మందారాలు ఒక్కటేంటి అన్నీ నన్ను పిలుస్తున్నట్టు తలలూపుతాయి. వాటిమీద సీతాకోకచిలుకలా ఎగురుతుంది నా మనసు.చిన్నప్పటినుంచి నాకా కిటికీ అంటే చాలా ఇష్టం. బాగా చిన్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకుని వంట చేస్తుంటే నేను కిటికీలోంచి చూస్తూ పూలని రమ్మని చెయ్యూపేదాన్నిట.ఇంకొంతకాలం గడిచాక అమ్మ చీర కుచ్చెళ్ళు పట్టుకుని నిలబడి కాళ్లు కాస్త పైకెత్తి చూస్తే ఎక్కడో ఆకాశాన్ని అంటుతున్నట్టు…

మలి వసంతం by S Sridevi

పేపరు తిరిగేస్తూ మధ్యమధ్య యామిని ఏం చేస్తోందోనని వంటింట్లోకి తొంగి చూస్తున్నాడు శశాంక. అతని నిరీక్షణ ఫలించి ఐదు నిమిషాలకి ఆమె ఇవతలికి వచ్చింది. చేతిలో షర్బత్ గ్లాసులతో. ఒకటి అతనికిచ్చి ఎదురుగా కూర్చుంది. మాట ఎలా కలపాలో ఇద్దరికీ తెలియడంలేదు.చల్లటిగాలి రివ్వుమని వచ్చి ఇంట్లోని వస్తువులన్నిటినీ పరామర్శించి వెళుతోంది. అలమారలోని పుస్తకాలు రెపరెపలాడుతున్నాయి. కరెంటు పోలేదు. అదొక్కటే అదృష్టం. అతను వస్తాడని తల్లీ తండ్రీ బయటికి వెళ్లిపోయారు. తామిద్దరూ అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలని.” మీరు మిలట్రీనుంచి…

వంకరగీత by S Sridevi

చాలాకాలం తర్వాత  యీ వూరొచ్చాను . ఈ ఊరంటే … నేను పుట్టి పెరిగిన ఊరు … డబులెమ్మే చదివి కూడా జాబ్ దొరక్క ఖాళీగా వుండలేక  ప్రైవేట్ స్కూల్స్ చుట్టూ తిరిగిన ఊరు. దాదాపు పదేళ్ళైంది . ఈ ఊరితో ఆఖరి అనుబంధం తెగిపోయి . ముఖ్యంగా సుమతితో.  పదేళ్ళలో ఊరేం మారలేదు . అదే గతుకులరోడ్డు , స్టేజీమీద ఆగని బస్సులు , ఎక్కడ ఎప్పుడాగుతాయో తెలీని ఆటోలు , బస్తాల్లాంటి బేగులు మోస్తూ…

అస్తిత్వసంతకం by S Sridevi

“ఆర్యూ క్రేజీ?” మెయిల్ చూసి వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచార్ మేనేజర్ లాస్య.“సరిగానే నిర్ణయిచుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవటానికి ఇంకేదీ వుండదు” అంది ప్రజ్ఞ.ఇరవయ్యేళ్ళకి బీటెక్. ఇరవై రెండేళ్ళకి ఎంబియ్యే. ఆ తర్వాత వెంటనే వుద్యోగం. పదిలక్షల పేకేజి. చక్కటి కార్పొరేట్ ఉద్యోగం. రోజూ ఏసీ కార్లో వెళ్లి రావడం. కంప్యూటర్లు, ల్యాప్‍టాప్‍లు, ఏసీ చాంబర్లు……

అర్హత by S Sridevi

“సమీరా!”పీఎఫ్‍లోంచీ డ్రా చేసి, హడావిడిగా బేగ్‍లో పెట్టిన డబ్బుని సీట్లో కూర్చుని స్థిమితపడ్డాక మరోసారి లెక్కపెట్టుకుంటున్న సమీర తలెత్తి చూపింది . టేబుల్‍కి అవతలి అంచుని నిలబడి వేదమూర్తి ఏదో అడగడానికి సంశయిస్తున్నట్టు నిలబడ్డాడు. ఏమిటన్నట్టు కళ్ళతోటే ప్రశ్నించింది.“మా అబ్బాయి ఫీజు… మీరు .. మీరేమీ అనుకోకపోతే ఐదువందలు … అప్పుగానే… ఇస్తే… శాలరీ రాగానే యిచ్చేస్తాను. మా మిసెస్ వంట్లో బాగుండకపోవడంతో యీ నెల .. బడ్జెట్ తలకిందులైంది… ప్లీజ్ ” మాటకి మాట అతుక్కోకుండా…

సందిగ్ధపు రహదారులు by S Sridevi

“నాన్నా! సాయంత్రం మాయింటికి రాగలవా?” అని అదితి అడిగిన ప్రశ్నకి-“అలాగే. ఆఫీసయాక అటే వస్తాను” అని జవాబిచ్చాడు ఆనంద్. ఆ విషయంమీద పెద్దగా ఏమీ ఆలోచించలేదు. అప్పుడప్పుడు కూతురలా రమ్మనడం తను వెళ్ళడం అలవాటే. కూతురూ అల్లుడూ ప్రైవేటు సంస్థల్లో వుద్యోగస్థులు. తను చేసేది పార్ట్ టైమ్ వుద్యోగం, అదీ గవర్నమెంటు ఆఫీసులో కాబట్టి వాళ్ళకి లేని వెసులుబాట్లు తనకి వుంటాయి. అలాంటి వెసులుబాటు వాడుకోవలసిన పనులేవైనా వచ్చినప్పుడు ఆమె రమ్మంటుంది. అదీకాక ఆనంద్ కి భార్యలేదు.…

గుమ్మడి గింజలు by S Sridevi

ఉన్నట్టుండి ఏదో ఒక జ్ఞాపకం జాగృతమవుతుంది. అది మరి దేనికో సంకేతం అవుతుంది. సృష్టిలో జరిగే ఏ సంఘటనా స్వతంత్రమైనది కానట్టే మనిషి జీవితంలో జరిగే ఏ ఒక్కటీ స్వతంత్రమైనది కాదు. అవన్నీ కీలుబొమ్మలయితే వాటిని ఆడించే దారాలు ఇంకెక్కడో ముడివేయబడి ఉంటాయి.….ఒక చిన్న సంఘటన . చాలా సామాన్యమైనది అందరిళ్ళలో జరిగేదే. అదిప్పుడు గుర్తొచ్చి శ్రీపతి కళ్ళముందు కదులుతోంది. జీవితసారం మొత్తాన్నీ కాచి వడకట్టే ప్రయత్నం చేస్తోంది.ఆ దృశ్యం…తల్లి కుంపటి ముందు కూర్చుని వంట చేస్తూ…

Loading…

Something went wrong. Please refresh the page and/or try again.


Follow My Blog

Get new content delivered directly to your inbox.