కాగితంమీది జలపాతం by S Sridevi

"వదినా! మీరసలు ఎక్కడున్నారు? చుట్టూ జరిగే విషయాలేమైనా పట్టించుకుంటున్నారా? లేదా? అమెరికాలో వున్న నాకే అన్ని విషయాలూ తెలుస్తుంటే అక్కడే వున్న మీకు యీ విషయం తెలీకపోవటమేమిటి?" ఫ్లోరిడానుంచీ వడగళ్ళవాన కురిసినట్టు రఘు ఫోను."ఇప్పుడేమైంది?" నా దృష్టినుంచీ తప్పించుకుపోయిన జాతీయ, అంతర్జాతీయ విషయం ఏమై వుంటుందా అని ఆలోచించాను. అలాంటివేవీ గుర్తుకి రాలేదు."మనూర్లో రింగురోడ్డు పడుతోందటకదా? సిటీకి డైరెక్టుగా కలుపుతూ రోడ్డేస్తున్నారటకదా? ఆ అలైన్‍మెంట్స్‌కి అటూ యిటూ వున్న భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరాకి కోటి … Continue reading కాగితంమీది జలపాతం by S Sridevi

అంచనా తప్పింది by S Sridevi

జీవితంలో విజయాలు… అహంకారం… అభిజాత్యం… మనుషులు పొరపాట్లు చెయ్యడానికి ఇవే కారణాలు అయితే నేను ఈ కారణాలచేతనే ఒక పొరపాటు చేశాను.ఒక వ్యక్తి… ఆ వ్యక్తి నా సంతోషపు జీవితంలో ముల్లులా కదులుతుంటాడు. అతన్ని తలుచుకుని పద్మజ దిగులు పడుతుంది. అతను జ్ఞాపకానికొస్తే ఉదాసీనంగా ఉంటుంది. ముభావాన్ని ముసుగేసుకుంటుంది.అతను… నాకు ఒక పెద్ద సమస్యే.అతను… పద్మజ తండ్రి. పద్మజ? నా భార్య. బ్యాంక్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను.పదిహేను లక్షలకు పైగా వచ్చాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్. బాధ్యతలు … Continue reading అంచనా తప్పింది by S Sridevi

తప్పనిరిగా by S Sridevi

మనుషులు వున్నలాగ స్థిరంగా వుండలేరు . నిరంతరం మార్పు కోరుతూ పరుగు పెడుతుంటారు . బలవంతుడైనవాడు ఆ పరుగు మొదలుపెడితే వాడి వెనుక మిగిలినవారు సాగుతారు . మొదటివాడిది గమ్యం వున్న పరుగైతే మిగిలినవారిది అనివార్యత్వం . అలాంటి అనివార్యత్వమే సురేష్‍ని బాధపెడుతోంది .తిరిగి తిరిగి వచ్చి చేతిలోని ఫైలు టీపాయ్ మీద పడేసి అలసటగా సోఫాలో కూలబడ్డాడు. ముఖంలోనూ చేతల్లోనూ నిరాశానిస్పృహలు స్పష్టంగా వ్యక్తమయాయి . అలికిడికి ఆశగా లోపల్నుంచి వచ్చిన అనిత అతన్ని అలా … Continue reading తప్పనిరిగా by S Sridevi

నాకొద్దీ అభ్యుదయం by S Sridevi

అతనికోసం ఎదురుచూడటంలో రెండుగంటలు గడిచాయి. అప్రయత్నంగా వాచీ చూసుకున్నాను. తొమ్మిదిన్నరైంది. ఉదయకేసి చూశాను. తప్పుచేసినట్టు తలవంచుకుంది. చాలా నిరుత్సాహపడిందని గ్రహించాను."సారీ అన్నయ్యా! తప్పకుండా వస్తానని చెప్పాడు. ఎందుచేత రాలేదో! రేపు తనని తీసుకుని మీ ఇంటికి నేనే వస్తాను!"” అంది." ఏదైనా అనుకోని పని తగిలివుంటుంది. అతని అడ్రస్సివ్వు, నేను వెళ్లి కలుస్తాను!” అన్నాను.ఉదయ రాసిచ్చింది. అది అతని ఆఫీసు అడ్రసు."భోజనం చేసి వెళ్లకూడదూ?" లేస్తుంటే అడిగింది."రమ్య ఎదురు చూస్తూంటుంది!" అందామని నాలుక చివరిదాకా వచ్చిన మాటల్ని … Continue reading నాకొద్దీ అభ్యుదయం by S Sridevi

బంగారుపంజరం by S Sridevi

" కరుణ రాలేదా ? '' మత్తుతో కూరుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా విడదీసి చుట్టూ చూస్తూ నిరాశగా అడిగింది సుభద్ర . భార్యనలా చూస్తుంటే రావుకి ప్రాణం కొట్టుకుపోయింది . చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ కూతురికోసం … అదీ ఒక్కగానొక్క కూతురికోసం కలవరిస్తోంది . కానీ కూతురిది వచ్చే పరిస్థితి కాదు . ఆమె డాక్టరు . క్షణం తీరిక లేనంత బిజీ .."అది రాదే !రోజుకి పాతికవేల ఆదాయం వదులుకుని నీ దగ్గిరొచ్చి ఎందుకు … Continue reading బంగారుపంజరం by S Sridevi

కన్నీటి చుక్క ప్రయాణం by S Sridevi

ఏదో జరిగింది. ఇంటర్నెట్ పనిచెయ్యటం లేదు. ప్రపంచవ్యాప్తంగా. అప్పటికే కంప్యూటరైజేషన్ చేసుకున్న చాలాదేశాలు అల్లకల్లోలంగా వున్నాయి. ఇండియాకూడా కొంతవరకూ ప్రభావితమైంది. ఇంటర్నెట్‍కి సెర్వర్లుగా పనిచేస్తున్న సూపర్‍కంప్యూటర్లని హాక్ చేసారని ఒక అనుమానం. బగ్, వైరస్ ఏదేనా కావచ్చు. సమస్య, పరిష్కారం విడివిడిగా ప్రయాణిస్తూ కలయికకోసం వెతుక్కుంటున్నాయి. అవంతీపురం.ఇంటి నెంబరు 2-734.వంశీ ఇంటి అరుగుమీద కూర్చుని వున్నాడు. పదేళ్ళవాడు. అతని చిన్నిగుండె అలజడిగా వుంది. తల్లిదండ్రులు అమెరికాలో వుంటారు. విపరీతమైన అల్లరి చేస్తూ, తల్లిదండ్రులని ఎదిరిస్తున్నాడని వాళ్ళ అభియోగం. … Continue reading కన్నీటి చుక్క ప్రయాణం by S Sridevi

చిట్టికి క్షమాపణలతో by S Sridevi

చిట్టీ!నీ పేరేమిటోకూడా నాకు సరిగ్గా గుర్తులేదు. లక్ష్మీస్వరాజ్యం అని లగ్నపత్రిక రాయించినప్పుడు పురోహితుడు చదివినట్టు జ్ఞాపకం. చిట్టెమ్మని అందరూ అనేవారు.తాటాకుబొమ్మలా అల్పంగా వున్న నీకు తెల్లటి మధుపర్కాలు కట్టించి, పూలజడేసి, కంటో కాసులపేరో పేరు తెలియని ఒక నగ వేసి నా ఎదురుగా తెరకి అటువైపు కూర్చుండబెట్టారు. మంత్రాలూ, తదితరాలయ్యాయి. జీలకర్ర, బెల్లం పెట్టుకున్నాం. తెర తీసేసారు. నువ్వొచ్చి పెళ్ళిపీటమీద నాపక్కని కూర్చున్నావు. నేను నీమెళ్ళో మంగళసూత్రాలు కట్టాను. దట్టంగా కాటుక పెట్టుకున్న కళ్ళెత్తి నువ్వు తలొంచుకునే … Continue reading చిట్టికి క్షమాపణలతో by S Sridevi

మనుష్యరేణువులు by S Sridevi

"ఏందే, వూకే పక్కలొ మెసుల్తున్నావు? నిద్రొస్తలేదా?" రాత్రి పదకొండుగంటల వేళ భార్యనడిగాడు యుగంధర్."మనూరు పోయిరావాల్నని వుంది"జవాబిచ్చింది పద్మ."మనూరా?" ఆశ్చర్యంగా అడిగాడు."ఏం, వరంగల్ మనూరు కాదా?""వరంగలా? గక్కడ మనకేమున్నది? ఇల్లు, భూమి అమ్ముకున్నం. ఈ సిటీలకొచ్చినం. మా అన్న, మీ అక్కగూడ ఇక్కడనే వుంటిరి""కాని అది మనూరేగద? నేను పెట్రోల్‍పంపు స్కూల్ల చదివిన. పింగిళీ విమెన్స్ కాలేజుకు వెళ్లిన. శివరాత్రికి వెయ్యస్తంబాలగుడిల పూజలు చేసిన. బతుకమ్మలు పేర్చి, పద్మాక్షి చెర్ల కలిపిన. భద్రకాళి దేవతకు మొక్కులు మొక్కిన. ఇంకేం … Continue reading మనుష్యరేణువులు by S Sridevi

సింధూరి by S Sridevi

మనుషుల్లో కృత్రిమత పెరిగిపోయిందనేది వాస్తవం. తమకేం కావాలో తెలుసు. ఏం అక్కర్లేదో కూడా తెలుసు. ఏది కావాలో దాన్ని వదిలిపెట్టి, లేని అవసరాన్ని సృష్టించుకుని దానికోసం అవస్థపడటం జీవనశైలిగా మారిన నేపథ్యంలో-ముందురాత్రి క్రిస్టల్ ప్యాలస్‍లో జరిగిన పార్టీగురించి రావు అడిగిన ప్రశ్న-" బాగా ఎంజాయ్ చేసాం కదూ?" అని. అది గుర్తొచ్చింది నరేంద్రకి. వెంటనే పార్టీనేమాత్రం ఎంజాయ్ చెయ్యలేకపోయిన సింధూరి కూడా గుర్తొచ్చింది.ఇద్దరూ అలా వెంటవెంటనే గుర్తొచ్చారంటే వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందనికాదు, ఒకే విషయంమీద ఇద్దరి … Continue reading సింధూరి by S Sridevi

వప్పందం by S Sridevi

(ఆంధ్రభూమి 24.10.1999)సాయంత్రపు ఆకాశం నెమ్మదిగా చీకటి మునుగేసుకుంటోంది . ఆ ముసుగులోంచీ ఆశావాదికి ఉదయించబోయే మరో ఉషస్సు , నిరాశావాదికి గడిచిపోయిన ఒక దినం గోచరిస్తున్నాయి . ఆశ నిరాశల మధ్య వూగిసలాడుతున్న సురేంద్రకి మాత్రం ఆ క్షణం చాలా ఉద్విగ్నంగా అనిపిస్తోంది ."మీరొద్దంటే ఆ జాబ్ నాకొస్తుంది " నిస్సహాయంగా అన్నాడు . అతనిలో ఉక్రోషం … కసి …. కనీకనిపించనట్టు ." నేనెందుకు వద్దనాలి ? " మైత్రేయి ఎదురు ప్రశ్న వేసింది .ఆమె … Continue reading వప్పందం by S Sridevi